1
00:00:08,926 --> 00:00:10,086
అతితెలివి ప్రదర్శిస్తే
2
00:00:10,845 --> 00:00:13,175
నీ స్నేహితుడి వీపులోకి బులెట్ దించుతాను.
3
00:00:23,733 --> 00:00:26,783
- నువ్వు నా స్నేహితుడివి అనుకున్నాను.
- ఉండేవాడిని.
4
00:00:26,861 --> 00:00:29,861
అందుకే నీకు ఇక్కడ
ఉద్యోగం ఒప్పుకోకు అని చెప్పాను.
5
00:00:31,574 --> 00:00:35,294
- నువ్వు ఎలాంటి పోలీసువి?
- డబ్బు ఉన్న చోట ఉండేలాంటి వాడిని.
6
00:00:36,245 --> 00:00:39,705
పాత భాగస్వామి దొంగనోట్ల ముఠాను
రక్షిస్తే డబ్బు ఇస్తానన్నాడు,
7
00:00:39,707 --> 00:00:41,997
కానీ నన్ను పిల్లల్ని చూడడానికి పెట్టావు.
8
00:00:42,001 --> 00:00:45,881
నేను మరోలా అనుకున్నాను, ఇదంతా
తీవ్ర పరిణామాలు లేకుండా సమిసిపోతుందని.
9
00:00:45,880 --> 00:00:48,630
కానీ లేదు, నువ్వు, ఈ చింపాజీ
విషయాలను వదిలేయలేదు.
10
00:00:48,716 --> 00:00:52,176
- రాస్కో ఎక్కడుంది?
- మా అమ్మాయి బాగానే ఉంది.
11
00:00:55,097 --> 00:00:56,057
రీచర్.
12
00:00:56,140 --> 00:00:58,390
నువ్వు వాళ్ళు చెప్పింది చేయాలని
13
00:00:58,476 --> 00:01:01,936
లేదా, నన్ను, చార్లీని, పిల్లలను,
14
00:01:02,021 --> 00:01:05,021
మోరిసన్‌ను చేసినట్టు
చేస్తారని చెప్పమన్నారు.
15
00:01:06,609 --> 00:01:08,899
మీకు కావాల్సింది ఏదైనా, నేను అది చేయను.
16
00:01:08,903 --> 00:01:11,993
వాళ్ళకు చాలా తెలుసు.
వాళ్ళను ఎలానూ వదిలేయరు.
17
00:01:11,989 --> 00:01:13,199
నువ్వు తెలివైన వాడివి.
18
00:01:13,199 --> 00:01:15,489
నువ్వు, ఫిన్లీ, రాస్కో, మీరంతా చస్తారు.
19
00:01:15,493 --> 00:01:18,163
కానీ చార్లీనీ, పిల్లలను
వదిలేయాలని అనుకుంటున్నా.
20
00:01:18,162 --> 00:01:20,832
మహిళా పౌరులు, పిల్లలను చంపితే,
21
00:01:20,915 --> 00:01:24,495
జనం ఉద్వేగానికి లోనవుతారు,
చాలా ప్రశ్నలు తలెత్తుతాయి.
22
00:01:24,502 --> 00:01:26,422
వాళ్ళు మాట్లాడుకునేది ఆలోచించను.
23
00:01:26,504 --> 00:01:29,844
వాళ్ళ నాన్నకు చేసింది చూశాక
ఇంకేం మాట్లాడరు.
24
00:01:31,383 --> 00:01:32,893
హబుల్.
25
00:01:32,885 --> 00:01:35,425
- అతన్ని చంపేశావా?
- పారిపోవాలని అనుకున్నాడు.
26
00:01:35,513 --> 00:01:38,063
తన కుటుంబ రక్షణకు
కనిపించకుండా పోవాలనుకున్నాడు.
27
00:01:38,057 --> 00:01:40,057
అతను తప్పు. నాకు అతను కావాలి.
28
00:01:40,059 --> 00:01:41,439
పరిష్కరించని విషయం.
29
00:01:41,519 --> 00:01:44,309
నేను పరిష్కరించలేనిదని నువ్వనుకుంటావు.
30
00:01:44,313 --> 00:01:47,193
మీ నాన్న విదేశాలలో
కొందరు దుష్టులకు చాలా దొంగనోట్లు
31
00:01:47,191 --> 00:01:50,901
ఇస్తానని మాటిచ్చాడు.
కానీ కోస్ట్ గార్డ్ దిగ్బంధం వలన,
32
00:01:50,903 --> 00:01:54,243
వాళ్ళు చెల్లించిన దానికి ఏమీ అందలేదు.
33
00:01:54,240 --> 00:01:59,200
కొంతమంది వెనిజులా హంతకులను మీ సాయానికి
పంపారు... తిరిగి గాడిలో పెట్టెందుకు.
34
00:01:59,203 --> 00:02:00,753
కానీ పరిస్థితులు చెడిపోయాయి.
35
00:02:00,830 --> 00:02:03,000
వెంటనే, ఆ వెనిజులా వాళ్ళు నీకు
36
00:02:03,082 --> 00:02:05,422
మీ నాన్నలాగే మెడకు ఒక తాడు వేస్తారు.
37
00:02:11,048 --> 00:02:12,758
నేను మా నాన్నను చంపాను.
38
00:02:13,551 --> 00:02:18,221
అతని మెడను వెనిజులా వాళ్ళు
చేస్తున్నప్పుడు చూసినట్టుగానే కోశాను.
39
00:02:18,222 --> 00:02:21,682
ముసలాయనకు ఈ మొత్తం ఆపరేషన్‌ను
సృష్టించే తెలివి ఉంది,
40
00:02:21,684 --> 00:02:25,354
కానీ దాని సంరక్షణకు
కావాల్సింది చేసే ధైర్యం లేదు.
41
00:02:25,354 --> 00:02:30,404
అందుకని పికార్డ్ భాగస్వామిని మెంఫిస్‌లో
ఏజెంట్‌ను చంపేందుకు నియమించాను,
42
00:02:30,401 --> 00:02:34,031
ఇంకా డాసన్‌ను
అది సరిగా చేసేలా చేసేందుకు పంపాను.
43
00:02:34,113 --> 00:02:39,203
నేను జాబ్లింగ్‌ను చంపాను.
ఆ చెత్తమొహాన్ని సబ్‌వేలో చంపాను.
44
00:02:39,743 --> 00:02:41,453
ఇంకా నేను...
45
00:02:46,083 --> 00:02:47,883
నేను మీ అన్నయ్యను చంపాను.
46
00:02:56,135 --> 00:02:57,465
నువ్వు జోను కాల్చావు,
47
00:02:58,721 --> 00:03:01,061
డాసన్ తను చనిపోయాక తన్నాడు,
48
00:03:02,683 --> 00:03:04,443
మోరిసన్ తనను దాచాడు.
49
00:03:04,435 --> 00:03:08,605
నేను మోరిసన్‌ను చంపాక,
ముసలాయన వశం తప్పాడు.
50
00:03:08,606 --> 00:03:11,776
అతను నన్ను దూరంగా కొన్ని రోజులు
మానసిక చికిత్సాలయానికి
51
00:03:11,859 --> 00:03:14,609
చికిత్సకు పంపుతానని అనడం మొదలుపెట్టాడు.
52
00:03:16,322 --> 00:03:20,082
నా చిన్నతనంలో ఒకసారి ప్రయత్నించాడు,
కానీ అవును, లాభం లేకపోయింది.
53
00:03:20,159 --> 00:03:21,039
ఉండదు.
54
00:03:21,035 --> 00:03:25,245
చూస్టుంటే రీచర్ సోదరులు
పట్టణం బయట నుండి వచ్చిన పోలీసుతో కలిసి
55
00:03:25,331 --> 00:03:28,131
మాదకద్రవ్యాలు, తుపాకులు లేదా
ఏదో దుర్మార్గపు పనులు
56
00:03:28,125 --> 00:03:30,835
మా మార్‌గ్రేవ్
పవిత్ర వీధుల గుండా చేస్తున్నారు.
57
00:03:30,920 --> 00:03:33,210
ఒక బ్యాంకర్‌ను
అర్థికంగా సహకరించేలా చేశారు,
58
00:03:33,297 --> 00:03:38,757
నైతికతలేని స్థానిక పోలీసులకు లంచాలిచ్చారు,
తరువాత మీరంతా ఒకరినొకరు మోసం చేసుకున్నారు.
59
00:03:38,761 --> 00:03:42,681
నువ్వు పికార్డ్‌ను తీసుకెళ్ళి
హబుల్‌ను తీసుకువస్తావు.
60
00:03:42,765 --> 00:03:45,975
- నేను అది చేస్తానని ఎలా అనుకున్నావు?
- నువ్వు ఒక ట్రాకర్‌వు.
61
00:03:46,060 --> 00:03:50,810
వెళ్ళి అతనిని కనుగొను. ఆ తరువాత నేను
తల్లీపిల్లలను తండ్రితో బేరమాడతాను.
62
00:03:50,898 --> 00:03:53,318
పికార్డ్‌కు నా నంబర్ గుర్తుంది.
63
00:03:53,317 --> 00:03:57,527
నాకు నీనుండి హబుల్‌ను నిర్బంధించాం అని
ఉదయం 6 గంటలకల్లా ఫోన్ రాకపోతే...
64
00:03:59,365 --> 00:04:04,825
నేను బంధించిన ఆ నలుగురు మహిళలు
నువ్వు కనీసం ఊహించలేని విధంగా చస్తారు.
65
00:04:09,333 --> 00:04:14,253
రీచర్
66
00:04:27,643 --> 00:04:30,733
నేను హబుల్‌ను ఎలా కనుగొంటానని
అనుకుంటున్నారో తెలియదు.
67
00:04:30,813 --> 00:04:35,073
నీకు రేపు సూర్యోదయం దాకా ఉంది,
అందుకని నువ్వు కనుగొనమని చెబుతాను.
68
00:04:35,067 --> 00:04:38,947
నువ్వు నన్ను ఎక్కడా ఆపనీయకపోతే
మనం గమ్యం లేకుండా వెళుతూనే ఉంటాము.
69
00:04:38,946 --> 00:04:40,856
మ్యాప్, ఆలోచించేందుకు చోటు కావాలి.
70
00:04:43,951 --> 00:04:47,581
సరే. కానీ ఏదైనా చేయాలని చూస్తే,
ఇది పేలుతుంది.
71
00:04:48,539 --> 00:04:49,539
అర్థమైంది.
72
00:04:53,502 --> 00:04:55,422
మీకు ఏం ఇవ్వమంటారు?
73
00:04:55,421 --> 00:04:57,301
డికాషన్, పీచ్ పై.
74
00:04:57,381 --> 00:04:58,631
నాకేమీ వద్దు.
75
00:05:00,551 --> 00:05:01,471
స్వీట్?
76
00:05:02,678 --> 00:05:05,718
నేను చాలా రోజులనుండి
అది కావాలని అనుకుంటున్నాను.
77
00:05:06,223 --> 00:05:07,273
నాకు ఒక పెన్ ఇవ్వు.
78
00:05:07,266 --> 00:05:10,846
నీకు నేను ఏదైనా ఇస్తే,
అది ఆయుధంలా వాడాలని అనుకుంటున్నావా?
79
00:05:17,151 --> 00:05:18,151
నిన్నది భయపెడుతుందా?
80
00:05:21,071 --> 00:05:21,911
సరే.
81
00:05:40,257 --> 00:05:41,507
అతను అగస్టాలో ఉన్నాడు.
82
00:05:43,093 --> 00:05:44,183
అలా చేప్పేశావా?
83
00:05:44,178 --> 00:05:47,928
బతకడానికి వాళ్లను వెంటాడాను.
వాళ్ళు ఎలా ఆలోచిస్తారో తెలుసు.
84
00:05:48,599 --> 00:05:50,729
నేను హబుల్ అయితే,
నేను అగస్టాకు వెళతాను.
85
00:05:51,685 --> 00:05:52,515
ఎందుకు?
86
00:05:53,437 --> 00:05:56,317
తన కుటుంబ రక్షణకు,
వాళ్ళకు దూరంగా వెళ్ళేందుకు,
87
00:05:56,315 --> 00:05:58,935
కానీ చాలా దూరంగా కాదు,
తను వెనుకకు రావాలంటే.
88
00:05:59,026 --> 00:06:02,356
అందుకని అట్లాంటాకు పారిపోయాడు,
మార్‌గ్రేవ్ నుండి గంట ప్రయాణం.
89
00:06:02,446 --> 00:06:06,026
పెద్ద నగరం, చాలామంది జనం,
దాక్కోడానికి సులభం అనుకున్నాడు.
90
00:06:06,033 --> 00:06:10,003
ఆ తరువాత తెలుసుకున్నాడు, జనం ఎక్కువ ఉంటే
కనుగొనే అవకాశాలు ఎక్కువ అని,
91
00:06:10,079 --> 00:06:12,289
ముఖ్యంగా తన పాత బ్యాంక్‌కు శాఖ ఉంటే.
92
00:06:12,289 --> 00:06:13,249
వెళ్ళిపోయాడు.
93
00:06:13,332 --> 00:06:14,252
అగస్టాకా?
94
00:06:15,000 --> 00:06:15,920
ఏథెన్స్.
95
00:06:15,918 --> 00:06:17,998
మార్‌గ్రేవ్ నుండి కేవలం రెండు గంటలు.
96
00:06:18,337 --> 00:06:21,257
తన కుటుంబాన్ని వదలాలని లేని వ్యక్తికి
97
00:06:21,340 --> 00:06:22,970
అది కష్టమైనది.
98
00:06:23,050 --> 00:06:26,510
అది దశల వారిగా చేశాడు.
కానీ ఏథెన్స్ యూనివర్శిటీ ఆఫ్ జార్జియాకు
99
00:06:26,512 --> 00:06:28,812
పుట్టినిల్లు. పాల్, చార్లీ కాలేజీ.
100
00:06:28,806 --> 00:06:33,346
ఇది హబుల్‌కు నేరుగా సంబంధం ఉన్నది,
వాళ్ళు చూసే మొదటి చోటు.
101
00:06:33,352 --> 00:06:34,982
ఒక రోజు తరువాత వెళ్ళిపోతాడు.
102
00:06:35,646 --> 00:06:37,016
అయితే తరువాతది అగస్టా.
103
00:06:37,106 --> 00:06:39,726
మూడు గంటల దూరంలో ఉన్నది
కానీ దగ్గర ఉన్నది
104
00:06:39,817 --> 00:06:41,777
తన కుటుంబానికి దగ్గరైనది అనుకున్నాడు.
105
00:06:41,777 --> 00:06:44,817
పైగా, హబుల్ ఒక గోల్ఫర్ కూడా,
అతను అగస్టాకు ఆడాడు.
106
00:06:44,822 --> 00:06:47,832
అంటే అతను ఎన్నడూ లేని నగరంలో
మంచి జ్ఞాపకాలు అని.
107
00:06:47,825 --> 00:06:49,695
ఒత్తిడి సమయంలో అది ఉపశమనం,
108
00:06:49,785 --> 00:06:52,405
వాళ్ళ అమ్మ తనకు
రాకీ రకూన్ పాడినప్పటి భావన.
109
00:06:54,998 --> 00:06:55,868
పిచ్చిమాటలు.
110
00:06:56,625 --> 00:07:00,915
ఎవరినైనా చూస్తూ
వాళ్ళ ఆలోచనలు ఏంటో ఇట్టే పనిగట్టేయవచ్చు.
111
00:07:00,921 --> 00:07:04,261
నేను ఏ సహాయమూ చేస్తానని అనలేదు.
వెధవులు మీరు కావాలన్నారు.
112
00:07:05,425 --> 00:07:08,925
ఇప్పుడు నన్ను చంపేందుకు
ఏది మంచి సమయం, చోటు అని ఆలోచిస్తున్నావు.
113
00:07:08,929 --> 00:07:11,349
నీకు తెలుసు నాకు తెలియకుండా దాడి చేయాలి
114
00:07:11,348 --> 00:07:15,188
ఎందుకంటే నాకు తెలిశాక
నువ్వు నన్ను చంపలేవు.
115
00:07:16,311 --> 00:07:20,021
నిన్ను సమస్యనుండి బయటపడేస్తాను.
నువ్వు చంపలేవు.
116
00:07:20,899 --> 00:07:22,149
అందుకని నేను నువ్వయితే...
117
00:07:23,944 --> 00:07:25,744
నేను నీకు తెలియకుండా దాడి చేస్తాను.
118
00:07:27,781 --> 00:07:31,241
కాఫీ, డికాషన్, ఇంకా పీచ్ ముక్క.
119
00:07:32,244 --> 00:07:33,414
ధన్యవాదాలు.
120
00:07:35,539 --> 00:07:39,169
- శుభ్రం చేసేవరకు మరో చోట కూర్చుంటారా?
- క్షమించు, అది నా పొరపాటు.
121
00:07:39,168 --> 00:07:40,788
లేదు, నిజానికి, మనం వెళ్ళాలి.
122
00:07:43,380 --> 00:07:45,380
అగస్టా విషయంలో నువ్వు నిజమవ్వాలి.
123
00:08:11,074 --> 00:08:14,124
నువ్వు నేను అనుకున్న దానికంటే
కొంచెం కఠినమైనవాడివి.
124
00:08:16,872 --> 00:08:19,462
కానీ నువ్వు సరిగ్గా
నేను అనుకున్నట్టే ఉన్నావు.
125
00:08:46,735 --> 00:08:49,275
{\an8}టైర్లలో గాలి లేదు. మనం అది చూడాలి.
126
00:08:49,947 --> 00:08:50,857
నడుపుతూనే ఉండు.
127
00:08:54,618 --> 00:08:55,738
పూర్తిగా గాలి పోయింది.
128
00:08:56,495 --> 00:08:58,575
మనం అగాస్టాను వెళ్ళలేము.
129
00:08:59,748 --> 00:09:02,828
- నువ్వు తెలివి చూపిస్తున్నావా?
- నాతో సమయం అంతా ఉన్నావు.
130
00:09:04,878 --> 00:09:07,548
మంచిది. సరే... పక్కకు ఆపు.
131
00:09:17,015 --> 00:09:21,725
నేను అది మార్చడానికి వెళుతూ నిన్ను ఒంటరిగా
వదిలేస్తానని అనుకున్నావా? రా మార్చు.
132
00:09:28,026 --> 00:09:31,566
ఇంకా నావైపు టైరు తోయాలని ఆలోచించకు.
133
00:09:32,656 --> 00:09:33,696
నా ప్రణాళిక కాదు.
134
00:09:43,041 --> 00:09:45,091
కేజే నా ఫోన్ కోసం వేచి ఉంటాడు.
135
00:09:46,420 --> 00:09:50,130
నా గొంతు మాత్రమే
చార్లీని, ఆమె పిల్లలను సజీవంగా ఉంచుతుంది.
136
00:09:50,132 --> 00:09:53,302
నన్ను కాలిస్తే,
నువ్వు చంపేది నన్ను ఒక్కడినే కాదు.
137
00:09:54,261 --> 00:09:56,471
అది నేను ఆలోచించలేదనుకుంటా.
138
00:09:56,805 --> 00:09:59,635
కానీ నన్ను కాలిస్తే,
ఎప్పటికీ హబుల్‌ను కనుగొనలేవు.
139
00:10:04,271 --> 00:10:05,941
ఇద్దరికీ పరస్పర అవసరం ఉంది.
140
00:10:06,690 --> 00:10:07,820
సరే, మంచిది.
141
00:10:09,401 --> 00:10:10,901
నేను నిన్ను చంపను.
142
00:10:12,404 --> 00:10:13,494
నన్ను చంపుతావా?
143
00:10:15,198 --> 00:10:16,118
లేదు.
144
00:10:17,826 --> 00:10:18,866
మాట ఇస్తున్నాను.
145
00:10:18,869 --> 00:10:20,909
నీ మాటకు విలువ లేదు.
146
00:10:20,996 --> 00:10:23,166
కానీ ప్రస్తుతం మరో దారి లేదు.
147
00:10:24,624 --> 00:10:26,004
అందుకని ఒకటి అనగానే,
148
00:10:27,544 --> 00:10:29,674
మన తుపాకులను తల పైకి పెట్టాలి.
149
00:10:30,881 --> 00:10:34,801
రెండుకు, వాటిని డిక్కి మీద పెట్టాలి...
150
00:10:34,885 --> 00:10:38,425
నాకు తుపాకీని లోహం మీద పెట్టగానే వచ్చే
శబ్దం తెలుసు, మోసం చేయకు.
151
00:10:38,430 --> 00:10:43,390
మూడు అనగానే, మనం ఎదురెదురుగా
నిలబడి, చేతులు పైకి పెట్టి ఉంటాము.
152
00:10:43,477 --> 00:10:48,267
అప్పుడు నేను రెండడుగులు వెనక్కి వేస్తాను,
నువ్వు వచ్చి నా తుపాకీ తీసుకో.
153
00:10:50,692 --> 00:10:51,572
అర్థమైందా?
154
00:10:53,070 --> 00:10:54,070
ఆ, అర్థమైంది.
155
00:10:56,615 --> 00:10:57,695
సరే.
156
00:11:00,077 --> 00:11:01,157
ఒకటి...
157
00:11:08,335 --> 00:11:09,495
రెండు...
158
00:11:13,131 --> 00:11:13,971
మూడు.
159
00:11:42,452 --> 00:11:45,582
అగస్టా బస్ స్టేషన్‌కు మూడు మైళ్ళలో
హోటల్స్‌ను కనుగొను.
160
00:11:45,664 --> 00:11:47,924
మీ అభ్యర్థన ప్రక్రియ మొదలయింది.
161
00:12:23,410 --> 00:12:24,620
హలో, హబుల్.
162
00:12:47,225 --> 00:12:48,435
మహిళలు.
163
00:12:49,186 --> 00:12:50,646
మనం ఇక్కడ ఉన్నాం.
164
00:12:50,729 --> 00:12:53,819
నీ బాయ్‌ఫ్రెండ్ ఆమె పిరికి భర్తను
కనుగొనేందుకు వెళ్ళాడు.
165
00:12:53,899 --> 00:12:56,189
కాసేపట్లో వచ్చేస్తాడు, హాయిగా ఉండండి.
166
00:12:59,070 --> 00:13:02,950
మీ నాన్న మాకు చాలా సమస్యలు
కొని తెచ్చాడు, అది మీకు తెలుసా?
167
00:13:06,328 --> 00:13:07,498
లేదు.
168
00:13:07,496 --> 00:13:08,706
దయచేసి, వద్దు.
169
00:13:08,705 --> 00:13:13,165
పరవాలేదు. లేదు, పరవాలేదు.
నువ్వు అతనితో వెళ్ళు. అంత బాగానే ఉంటుంది.
170
00:13:13,168 --> 00:13:15,708
- ఏంటిది. అలా చేయకు!
- కానీ చేయాలి.
171
00:13:15,712 --> 00:13:18,172
నువ్వు, నీ స్నేహితులు ఇబ్బందిపెట్టేవారు.
172
00:13:19,257 --> 00:13:20,467
కూర్చోండి, మాట్లాడకండి.
173
00:13:21,259 --> 00:13:24,219
నీ పాత స్నేహితుడు తంటాలమారి గ్రే లాగా.
174
00:13:24,221 --> 00:13:26,891
అయినా, తుపాకుల మీద మంచి అభిరుచి కలవాడు.
175
00:13:27,849 --> 00:13:31,309
బీమా పనులు సజావుగా సాగేందుకు
వాళ్ళను సురక్షితంగా ఉంచుతాము.
176
00:13:31,311 --> 00:13:35,191
సజావుగా సాగకపోతే,
వాళ్ళు ఈ రసాయన టబ్బుల్లో పడిపోతారు.
177
00:13:41,029 --> 00:13:44,949
నేను ఏ నగరంలో ఉన్నానో అలా కనుగొన్నావు.
నా హోటల్ ఎలా కనుగొన్నావు?
178
00:13:44,950 --> 00:13:49,250
క్రెడిట్ కార్డులు వాడితే, క్లైనర్
కనుగొంటాడు. డబ్బు వాడాలి, బస్ ప్రయాణం.
179
00:13:49,246 --> 00:13:53,246
డబ్బు మిగలాలి, అందుకని తక్కువ అద్దె
హోటళ్ళలో మాత్రమే నువ్వు ఉండగలవు.
180
00:13:53,250 --> 00:13:56,920
బస్ డిపోకు నడిచేంత
దగ్గరగా ఉన్న హోటళ్ళను చూశాను.
181
00:13:56,920 --> 00:14:00,880
గుర్తింపు అవసరం లేని
గంటకు చెల్లింపులను ఉపయోగిస్తావు.
182
00:14:00,966 --> 00:14:04,756
- నా మారు పేరు ఎలా తెలిసింది?
- తమకు ఇష్టమైనవాటి పేర్లు పెట్టుకుంటారు.
183
00:14:05,262 --> 00:14:06,602
నీకు బీటిల్స్ ఇష్టం.
184
00:14:06,680 --> 00:14:10,140
మొదటి అక్షరంతో మొదలుపెట్టాను. హ్యారిసన్.
185
00:14:12,644 --> 00:14:15,734
- వాళ్ళు నా కుటుంబాన్ని వదిలేస్తారంటావా?
- లేదు.
186
00:14:16,982 --> 00:14:19,482
నేను వాళ్ళకు సహకరించేందుకు అలా చెప్పారు.
187
00:14:19,568 --> 00:14:23,068
మనందరినీ మా అన్నయ్యలాగా
చంపాలన్నదే వాళ్ళ ప్రణాళిక.
188
00:14:24,864 --> 00:14:26,784
నీ ట్రెజరీ పరిచయం.
189
00:14:27,534 --> 00:14:30,544
- మార్క్ సాలస్?
- అతను నీకు చెప్పిన పేరు అది.
190
00:14:30,537 --> 00:14:32,367
అసలు పేరు జో.
191
00:14:32,372 --> 00:14:35,422
మార్క్ సాలస్ 80లలో యాంకీస్‌కు ఆడాడు.
192
00:14:38,044 --> 00:14:41,424
క్షమించు. జో విషయానికి.
193
00:14:42,215 --> 00:14:45,335
నేను కోస్ట్ గార్డ్ దిగ్బంధం
ఎత్తేస్తున్నారని విన్నాను.
194
00:14:45,427 --> 00:14:47,797
వెనిజులా వాళ్ళు
క్లైనర్‌ను గమనిస్తూ ఉన్నారు
195
00:14:47,804 --> 00:14:52,184
ఎందుకంటే ఉత్పత్తి నిలిచిపోయింది.
కానీ నాకు తెలుసు, దిగ్బంధం ముగియడంతో,
196
00:14:52,267 --> 00:14:55,767
వ్యాపారం తిరిగి పుంజుకునేలోపు
నేను బయటపడాలి.
197
00:14:55,854 --> 00:14:58,944
అందుకని ఫెడరల్‌కు సమాచార సందేశం పంపాను.
198
00:14:59,024 --> 00:15:00,444
జో నీకు తిరిగి ఫోన్ చేశాడు.
199
00:15:00,442 --> 00:15:04,452
మొదట, రక్షణకు బదులుగా సహాయం చేశాను.
200
00:15:04,446 --> 00:15:07,906
కానీ నగదు మాయమవుతుందని అప్పుడు గమనించాను.
ఆ తరువాత...
201
00:15:07,991 --> 00:15:10,541
- అది ట్రక్ డ్రైవర్‌కు అంటగట్టాను.
- పీట్ జాబ్లింగ్.
202
00:15:10,619 --> 00:15:14,079
అతను నిరాకరించాడు, కానీ క్లైనర్ మనుషులు
నా కళ్ళ ముందే ఒకరిని
203
00:15:14,164 --> 00:15:17,294
చంపారని చెప్పాను, అతను పాలిపోయాడు.
204
00:15:19,836 --> 00:15:21,836
అందుకని అతన్ని జోకు పరిచయం చేశాను.
205
00:15:21,838 --> 00:15:24,468
క్లైనర్‌కు అప్పటికే
జాబ్లింగ్ మీద కళ్ళు పడ్డాయి.
206
00:15:26,551 --> 00:15:30,181
నన్ను క్షమించు, రీచర్.
మీ అన్నయ్యను చంపించాను.
207
00:15:30,180 --> 00:15:32,270
లేదు, నువ్వు చంపించలేదు.
208
00:15:32,349 --> 00:15:33,599
జోను కేజే చంపాడు.
209
00:15:34,893 --> 00:15:35,733
పిల్లాడా?
210
00:15:35,727 --> 00:15:39,557
అతను జోను, మోరిసన్‌ను,
స్టీవెన్‌సన్ ఇంకా అతని భార్యను చంపించాడు.
211
00:15:39,648 --> 00:15:41,398
తన సొంత తండ్రిని కూడా చంపాడు.
212
00:15:42,984 --> 00:15:44,444
ఛ.
213
00:15:44,444 --> 00:15:46,954
నువ్వు నీ కుటుంబాన్ని
సజీవంగా ఉంచాలనుకుంటే,
214
00:15:47,030 --> 00:15:50,490
నేను చెప్పేది జాగ్రత్తగా విని,
చెప్పిందంతా చెయ్.
215
00:15:50,492 --> 00:15:51,412
సరే.
216
00:15:53,745 --> 00:15:56,665
- నేను నిన్ను ఒక ప్రశ్న అడగవచ్చా?
- సరే.
217
00:15:56,665 --> 00:15:58,995
నా రెండు కిటికీలకు ఎందుకు టింట్ వేసి ఉంది?
218
00:16:08,718 --> 00:16:11,548
డాసన్ ట్రక్ తాళంచెవి లోపల ఉంది.
నేను ఇప్పుడే వస్తాను.
219
00:16:11,638 --> 00:16:14,308
- నేను నీతో వస్తాను.
- నువ్వు అక్కడ కనిపించకూడదు.
220
00:16:14,391 --> 00:16:16,981
చాలా రక్తం, మట్టి ఇంకా దాడి చెత్త.
221
00:16:18,603 --> 00:16:21,113
మా పనమ్మాయికి కోసం వస్తుందేమో.
222
00:16:21,106 --> 00:16:23,436
మీ కొలను శుభ్రం చేసే అబ్బాయికంటే కాదు.
223
00:16:27,779 --> 00:16:29,029
నాకు ఏమీ తోచడం లేదు.
224
00:16:32,492 --> 00:16:34,492
నీకు కొంచెం సేపు సంకెళ్ళు తీస్తాను,
225
00:16:35,995 --> 00:16:37,905
పోరాటం మరింత ఆసక్తికరంగా చేస్తాను?
226
00:16:47,424 --> 00:16:49,514
హే, ఎవరో నీకు సందేశం పంపుతున్నారు.
227
00:16:51,344 --> 00:16:52,224
నేను చూస్తాను.
228
00:17:00,729 --> 00:17:04,069
"వంగి అడ్డు పెట్టుకో."
దానర్థం ఏంటి?
229
00:17:31,885 --> 00:17:32,835
బాగానే ఉన్నావా?
230
00:17:33,970 --> 00:17:35,010
బ్రతుకుతాను.
231
00:17:59,829 --> 00:18:01,829
ఏం చేయలేను
కానీ నువ్వు ఒంటరిగా ఉన్నావు.
232
00:18:02,707 --> 00:18:04,667
పికార్డ్ 6 గంటలలోపు ఫోన్ చేయకపోతే...
233
00:18:05,460 --> 00:18:06,750
6 గంటల వరకు అవసరం లేదు.
234
00:18:08,046 --> 00:18:09,416
- హబుల్?
- అవును.
235
00:18:15,011 --> 00:18:16,051
ఫిన్లీని తెచ్చాను.
236
00:18:17,972 --> 00:18:18,932
చూశాను.
237
00:18:22,101 --> 00:18:24,191
నిన్ను ప్రాణాలతో చూసి సంతోషంగా ఉంది.
238
00:18:24,896 --> 00:18:25,896
సరే.
239
00:18:25,897 --> 00:18:28,317
తుపాకీల లాకర్‌ను,
మందుగుండు అలమరాను పగలగొడదాం.
240
00:18:28,316 --> 00:18:29,606
ఉపయోగపడేవి తీసుకోండి.
241
00:18:46,709 --> 00:18:49,589
- ఇక్కడ బయటకు వెళ్ళే గొట్టం ఉందా?
- ఉంది. ఎందుకు?
242
00:18:49,671 --> 00:18:51,011
మనకు అది అవసరమవుతుంది.
243
00:18:53,341 --> 00:18:55,391
- పరవాలేదు. ఆమె నాతో ఉంది.
- బాస్.
244
00:18:56,177 --> 00:18:58,297
నీగ్లీ, వీళ్ళు ఫిన్లీ, హబుల్‌లు.
245
00:18:58,388 --> 00:19:00,138
ఫిన్లీ, హబుల్, తను నీగ్లీ.
246
00:19:01,182 --> 00:19:03,182
- అబ్బాయిలు.
- తను ఇక్కడకు ఎలా వచ్చింది?
247
00:19:04,060 --> 00:19:08,190
చివరి ఫోన్‌లో, పికార్డ్‌కు ప్రమేయం ఉందని
ఎలా తెలుసు అని రీచర్‌ను అడిగాను.
248
00:19:08,857 --> 00:19:10,437
"లక్కీగా ఊహించాను" అని అన్నాడు.
249
00:19:11,401 --> 00:19:14,901
రీచర్ వాస్తవాలు, గణాంకాలు నమ్ముతాడు.
అదృష్టాన్ని కాదు.
250
00:19:16,739 --> 00:19:18,869
బహుశా "అత్యవసరం" అని అరిచేవాడేమో.
251
00:19:19,951 --> 00:19:21,291
నీ స్నేహితురాలు ఏది?
252
00:19:25,707 --> 00:19:26,997
ఛ.
253
00:19:27,000 --> 00:19:28,380
మనం పని మొదలుపెట్టాలి.
254
00:19:29,085 --> 00:19:32,505
ఇక్కడ సెటప్‌కు ధన్యవాదాలు.
ఇంత రాత్రి ఇబ్బందికి క్షమించు.
255
00:19:32,589 --> 00:19:35,339
క్లైనర్‌కు శిక్షపడుతున్నందుకు
ఆనందంగా ఉంది.
256
00:19:40,388 --> 00:19:43,348
నేను పైకి వెళ్ళి, కాఫీ పెట్టుకుని వస్తాను.
257
00:19:44,893 --> 00:19:45,773
సరే.
258
00:19:45,852 --> 00:19:48,442
నేను ఇక్కడకు లక్షలసార్లు వచ్చాను.
ఇది లేఅవుట్.
259
00:19:49,272 --> 00:19:52,072
బహుశా రాస్కో, చార్లీలను
ఇక్కడ బంధించి ఉంటారు.
260
00:19:52,150 --> 00:19:55,150
కుదరదు, కానీ వాళ్ళు
వీళ్ళపైన కన్నేసి ఉంచగల చోట.
261
00:19:55,153 --> 00:19:56,363
నా పిల్లల సంగతి ఏంటి?
262
00:19:57,739 --> 00:19:59,279
మరోచోట బంధించి ఉంటారు.
263
00:19:59,282 --> 00:20:02,292
ఉన్మాద ఆలోచన, చార్లీ, రాస్కోలు
సరిగా వ్యవహరించేందుకు.
264
00:20:02,285 --> 00:20:03,995
బహుశా ఇక్కడ పైన.
265
00:20:03,995 --> 00:20:07,035
అక్కడ తాళం వేసి ఉంటారు,
గమనించేందుకు మనిషి అవసరం ఉండదు.
266
00:20:14,339 --> 00:20:18,639
తలుపు పక్కన ఇద్దరు,
బయటి మెట్ల దగ్గర ఒకరు.
267
00:20:19,552 --> 00:20:23,472
సెక్యూరిటీ కెమెరాలను నమ్మని వ్యక్తికి
అది ఎక్కువ మందుగుండు సామాగ్రి.
268
00:20:27,060 --> 00:20:28,230
అది నాకోసం.
269
00:20:28,311 --> 00:20:30,151
పికార్డ్‌తో ఉన్నావనుకుంటున్నారు.
270
00:20:30,146 --> 00:20:32,476
- నువ్వు ముప్పు కాదు.
- ఈపాటిని నేను తెలుసు.
271
00:20:32,482 --> 00:20:35,992
నేను, హబుల్ ముందు తలుపు గుండా
వెళతాము, మనందరినీ చంపేస్తారు.
272
00:20:36,069 --> 00:20:37,779
నేను మామూలుగా వెళ్ళనని అనుకుంటారు.
273
00:20:37,779 --> 00:20:40,819
అందుకని బయట తుపాకీలు,
లోపల భారీ ఆయుధాలతో ఉంటారు.
274
00:20:40,907 --> 00:20:43,117
ఒకవేళ నేను ఎలాగయినా వెళితే,
తూటాలు పేలుతాయి.
275
00:20:44,369 --> 00:20:46,289
అయితే ఏం చేద్దాం?
276
00:20:46,371 --> 00:20:47,791
మనం పేల్చుకుంటూ వెళదాం.
277
00:20:48,373 --> 00:20:51,083
మన వైపు నెమ్మదిగా చూస్తున్న
ఆ ఇద్దరినీ చంపాలి.
278
00:20:51,084 --> 00:20:53,804
వారిలో ఒకరి దగ్గర ఏ ఆటోమాటిక్ ఆయుధం లేదు.
279
00:20:53,795 --> 00:20:55,125
ఏ శబ్దమూ చేయరు.
280
00:20:55,213 --> 00:20:58,173
మంచిది. మీ ఆయుధాలను సరి చూడండి,
కాల్చేందుకు సిద్ధం.
281
00:20:58,174 --> 00:20:59,934
- సరే.
- హబుల్, నాతో రా.
282
00:21:10,520 --> 00:21:12,690
నువ్వు ఇంతకుముందు
ఎవరినీ కాల్చలేదనుకోవచ్చా?
283
00:21:14,983 --> 00:21:16,943
- ఎప్పుడూ తుపాకీ కాల్చలేదు.
- సరే.
284
00:21:17,860 --> 00:21:20,780
నువ్వు చేయాల్సిందల్లా చేతులు చాపి,
గురి చూసి కాల్చడం.
285
00:21:20,780 --> 00:21:23,910
అది వెంటనే వాడడానికి లేకపోతే
ఆయుధం ఉండడం అనవసరం.
286
00:21:24,325 --> 00:21:25,575
సంకోచిస్తే, చనిపోతావ్--
287
00:21:27,870 --> 00:21:29,870
చెడ్డ వారికి మాత్రమే గురి పెట్టు.
288
00:21:44,178 --> 00:21:45,928
పెట్రోల్ వాసన ఇష్టం.
289
00:21:48,433 --> 00:21:50,233
దుస్తుల పోగులు వచ్చేస్తున్నాయి.
290
00:21:50,226 --> 00:21:52,556
మనందరి తలలు వంచాలని అనిపిస్తుంది.
291
00:21:52,562 --> 00:21:55,522
అవును, నాకు దాని మీద
వాళ్ళ రక్తం పడకూడదని ఉంది.
292
00:21:56,774 --> 00:21:57,984
మంచి వైఖరి.
293
00:22:04,824 --> 00:22:06,834
- నువ్వు కాథలిక్‌వా?
- అవును.
294
00:22:11,247 --> 00:22:15,747
విను, మనం కలిసి చాలా మటుకు
పోరాడుతూ గడిపాము,
295
00:22:17,462 --> 00:22:20,472
ఖచ్చితంగా నీ సైనికులు
నీతో పనిచేయడం ఆనందించి ఉంటారు.
296
00:22:22,925 --> 00:22:24,835
నేనూ నీతో పనిచేయడం ఆనందించాను.
297
00:22:27,013 --> 00:22:30,183
అది సూటు వేసుకుని చెప్పడం కష్టం,
కానీ నీకు కండలు ఉన్నాయి.
298
00:22:33,186 --> 00:22:34,936
- నిజంగానా?
- కాదు.
299
00:22:38,399 --> 00:22:39,399
వెధవ.
300
00:22:49,452 --> 00:22:50,452
ఛ.
301
00:22:53,081 --> 00:22:56,001
హే. నిన్ను నువ్వు కూడగట్టుకో.
302
00:22:57,752 --> 00:22:59,842
వాళ్ళు మనల్ని చంపేస్తారు.
303
00:22:59,921 --> 00:23:02,421
- నా పిల్లలను చంపేస్తారు.
- లేదు, హే.
304
00:23:02,507 --> 00:23:04,507
నేను చెప్పేది విను, సరేనా?
305
00:23:05,301 --> 00:23:06,431
నాకు రీచర్ తెలుసు.
306
00:23:06,511 --> 00:23:10,431
అతను చూస్తూ ఊరుకోడు.
307
00:23:13,434 --> 00:23:17,064
ఆరింటికి ముందే ఏదో సమయంలో
దూసుకుని వచ్చేస్తాడు,
308
00:23:17,063 --> 00:23:19,943
కేజే, ఈ పోరాటం మొదలుపెట్టకుండా
ఉండాల్సిందనుకుంటాడు.
309
00:23:23,569 --> 00:23:25,909
రీచర్ ఇంకా హబుల్ ఈపాటికి వచ్చేసుంటారు.
310
00:23:25,905 --> 00:23:28,275
నిజంగా నేను ఒకరిని కాల్చాలనుకుంటా.
311
00:23:28,366 --> 00:23:30,486
ఇద్దరు షూటర్లు. మంచి అవకాశాలు.
312
00:23:30,493 --> 00:23:33,793
నీకు దూరం నుండి కాల్చే అనుభవం ఉందా?
313
00:23:34,914 --> 00:23:35,794
లేదు.
314
00:23:37,625 --> 00:23:38,625
నాకు ఉంది.
315
00:23:45,716 --> 00:23:47,636
బులెట్ సరిగ్గా దిగింది.
316
00:23:55,059 --> 00:23:56,729
స్నేహితుడు వాళ్ళు పడడం విన్నాడు.
317
00:24:02,984 --> 00:24:03,994
పద, పద, పద, పద.
318
00:24:20,710 --> 00:24:22,800
అది అంటుకోగానే జరుగు.
319
00:24:22,879 --> 00:24:23,879
అర్థమైంది.
320
00:24:26,299 --> 00:24:28,549
నువ్వు నీ పిల్లలను అక్కడి నుండి విడిపించు.
321
00:24:28,551 --> 00:24:31,301
ఎవరినీ నిన్ను అలా చేయకుండా అడ్డుకోనివ్వకు.
322
00:24:36,350 --> 00:24:38,980
సరే. సత్తా చూపాల్సిన సమయం.
323
00:24:38,978 --> 00:24:39,938
ఆగు.
324
00:24:41,147 --> 00:24:42,517
నాకు ఇది కనిపించింది.
325
00:24:47,445 --> 00:24:50,485
నేను చనిపోతే కనుక,
నేను చివరిసారిగా
326
00:24:50,573 --> 00:24:51,783
సిగరెట్ కాలుస్తాను.
327
00:25:01,000 --> 00:25:01,880
సరే.
328
00:25:03,753 --> 00:25:05,003
మనం చనిపోతామా?
329
00:25:06,589 --> 00:25:07,509
తెలుసుకుందాం.
330
00:25:22,438 --> 00:25:24,768
అది ఏంటి?
హే, ఇక్కడ ఏం జరుగుతోంది?
331
00:25:26,734 --> 00:25:28,994
- అది ఏంటి?
- రీచర్ వస్తున్నాడు.
332
00:25:31,197 --> 00:25:32,907
అసలు ఏం జరుగుతోంది?
333
00:25:39,163 --> 00:25:41,623
అక్కడికి వెళ్ళండి. మంటలు ఆర్పండి.
334
00:25:41,624 --> 00:25:43,214
కదలండి. వెళ్ళండి.
335
00:26:19,328 --> 00:26:20,998
అందరూ ఇక్కడ ఉన్నారు.
336
00:26:55,906 --> 00:26:59,196
- చార్లీ!
- పాల్! వెళ్ళిపో! వాళ్ళు అక్కడ ఉన్నారు!
337
00:27:04,165 --> 00:27:05,075
ఛ!
338
00:27:08,502 --> 00:27:09,712
అయ్యో, దేవుడా.
339
00:27:09,712 --> 00:27:10,672
సరే.
340
00:27:11,922 --> 00:27:13,092
ఛ.
341
00:27:13,174 --> 00:27:14,594
నాకు నీ చేతులు ఇవ్వు.
342
00:27:19,847 --> 00:27:20,767
ఇవ్వు!
343
00:27:29,607 --> 00:27:30,517
పట్టుకున్నాను!
344
00:27:31,442 --> 00:27:33,572
- వెళ్ళు.
- పరిగెత్తు! వెళ్ళు!
345
00:27:33,569 --> 00:27:35,739
వెళ్ళండి, వెళ్ళండి! వెళ్ళండి!
346
00:27:35,738 --> 00:27:37,028
వెళ్ళండి! అక్కడ పైకి.
347
00:27:38,574 --> 00:27:39,454
కిందకు వెళ్ళండి!
348
00:27:40,368 --> 00:27:43,158
వెళ్ళండి. బాగానే ఉన్నారు.
మీరు బాగానే ఉన్నారు.
349
00:27:48,542 --> 00:27:50,752
సరే. కిందకు. కిందకు. కిందకు ఉండండి.
350
00:27:58,719 --> 00:28:00,049
అతను ఇక్కడ ఉన్నాడు!
351
00:28:11,607 --> 00:28:12,607
తను కనిపిస్తున్నాడు.
352
00:28:22,701 --> 00:28:23,581
పరవాలేదు.
353
00:28:24,995 --> 00:28:26,405
ఆమెను ఇక్కడనుండి తీసుకెళ్ళు.
354
00:28:28,332 --> 00:28:29,712
ఆగు. ఇక్కడ.
355
00:29:02,950 --> 00:29:04,200
మీ పిల్లలను తీసుకెళ్ళు.
356
00:29:04,285 --> 00:29:05,235
ధన్యవాదాలు.
357
00:29:09,540 --> 00:29:11,290
- రా!
- పాల్!
358
00:29:11,292 --> 00:29:12,632
రా!
359
00:29:14,044 --> 00:29:15,634
కిందకు ఉండు!
360
00:29:31,312 --> 00:29:34,442
ఫిన్లీ, అది నువ్వేనా?
నువ్వు ఇక్కడే ఉన్నావని తెలుసు.
361
00:29:36,567 --> 00:29:38,527
పికార్డ్, చనిపోయావని అనుకున్నాను.
362
00:29:39,069 --> 00:29:40,149
ఇంకా లేదు.
363
00:31:18,210 --> 00:31:19,130
ఆగు!
364
00:31:20,212 --> 00:31:21,552
అలా చేయకు.
365
00:31:39,648 --> 00:31:40,768
నీగ్లీ.
366
00:31:44,236 --> 00:31:46,356
చాలా పొగ ఉంది! మనం వెళ్ళాలి!
367
00:31:49,158 --> 00:31:50,328
రాస్కో!
368
00:31:51,160 --> 00:31:52,120
ఇక్కడ ఉన్నాను!
369
00:31:56,165 --> 00:31:57,535
బాగానే ఉన్నావా?
370
00:31:58,834 --> 00:32:00,214
- పద వెళదాం!
- పద వెళదాం.
371
00:32:09,178 --> 00:32:10,548
తను ఎక్కడ?
372
00:32:10,638 --> 00:32:13,098
- రీచర్‌ను తీసుకురావాలి!
- తను బాగానే ఉంటాడు.
373
00:32:13,182 --> 00:32:15,182
అది నీకు ఎలా తెలుసు?
374
00:32:15,184 --> 00:32:16,524
ఎందుకంటే అతను రీచర్.
375
00:32:17,436 --> 00:32:19,306
- రాస్, పద వెళదాం.
- ఏం చేస్తున్నావు?
376
00:32:31,992 --> 00:32:32,872
హే!
377
00:32:32,868 --> 00:32:35,788
ఇప్పుడు ఇక నువ్వు, నేనే అనుకుంటా, రీచర్.
378
00:32:47,383 --> 00:32:49,263
నీకు ఒక కథ చెబుతాను, జాక్.
379
00:32:50,302 --> 00:32:53,602
అయితే, కొన్నేళ్ళ క్రితం,
380
00:32:54,807 --> 00:32:56,727
నేను సవానాకు సఫారీకి వెళ్ళాను.
381
00:32:57,893 --> 00:33:01,153
తెల్లవారుజామున దట్టమైన మంచు ఉంది,
మా నాన్న బ్యాంక్ ఖాతాలా.
382
00:33:01,230 --> 00:33:03,940
నేను ఇక్కడ పొగను మంచులా కనిపించేలా చేశాను.
383
00:33:03,941 --> 00:33:05,901
ఆ దట్టమైన పొగమంచులో,
384
00:33:06,819 --> 00:33:10,239
నాకు పెద్ద ఖడ్గమృగం కనిపించింది.
385
00:33:10,698 --> 00:33:14,788
బరువు చూస్తే ఆరువేల పౌండ్లు,
అది అక్కడ కూర్చుంది,
386
00:33:15,744 --> 00:33:17,044
గడ్డి తింటూ.
387
00:33:22,042 --> 00:33:24,842
ఇక, ఖడ్గమృగానికి
నేను అక్కడ ఉన్నానని తెలుసు.
388
00:33:26,213 --> 00:33:27,633
అది నన్ను పసిగడుతుంది,
389
00:33:29,675 --> 00:33:30,625
తెలుసుకోగలుగుతుంది.
390
00:33:32,010 --> 00:33:35,720
కానీ మంచుగా ఉంది, వెలుతురు లేదు,
391
00:33:35,723 --> 00:33:38,523
ఖడ్గమృగాలు సమీప దృష్టి కలది,
392
00:33:38,517 --> 00:33:41,477
అందుకని నేను నడుచుకుంటూ
393
00:33:41,562 --> 00:33:45,482
సరిగ్గా దాని వెనుకకు వెళ్ళి,
394
00:33:46,608 --> 00:33:47,818
దాన్ని చంపేశాను.
395
00:33:51,947 --> 00:33:56,287
నీకు తెలుసా, పిచ్చి ఖడ్గమృగం
396
00:33:57,703 --> 00:34:00,663
అది బలమైనదని తెలుసుకునేంత తెలివైనది కాదు.
397
00:34:01,707 --> 00:34:05,167
అది జీవితం అంతా
నెమ్మదిగా, భారంగా, అసహ్యంగా కదులుతూ,
398
00:34:06,211 --> 00:34:08,051
వెళ్ళాలనుకున్న చోటకు వెళుతూ,
399
00:34:10,924 --> 00:34:12,844
చేయాలనుకున్నది చేస్తూ,
400
00:34:14,219 --> 00:34:16,559
దేనితో కావాలంటే దానితో...
401
00:34:17,639 --> 00:34:19,769
వేటికి పర్యవసానాలు ఉండవు.
402
00:34:25,105 --> 00:34:29,105
కానీ జీవితంలో, ఎప్పుడూ పర్యవసానాలు ఉంటాయి.
403
00:34:31,195 --> 00:34:32,905
ఆ ఖడ్గమృగానికి ఉంటుంది.
404
00:34:35,407 --> 00:34:38,157
అందుకే దాని తల మా నాన్న
వసారాలో వేడాడుతుంది,
405
00:34:39,286 --> 00:34:41,906
సరిగ్గా దాని పక్కనే నీది ఉంటుంది.
406
00:36:40,532 --> 00:36:41,582
ఇది ముగిసింది.
407
00:36:57,382 --> 00:36:59,842
తిరిగి చికాగోలో
కొనసాగుతూనే ఉండు - నీగ్లీ
408
00:37:52,187 --> 00:37:53,437
హలో, రీచర్.
409
00:37:57,567 --> 00:37:58,487
బాగానే ఉన్నావా?
410
00:37:59,987 --> 00:38:01,027
బాగానే ఉన్నాను, జో.
411
00:38:02,322 --> 00:38:04,122
నీకు నేను నేర్పింది గుర్తుంచుకో.
412
00:38:04,116 --> 00:38:06,736
ఏం జరిగినా సరే, ఏడవకు.
413
00:38:33,979 --> 00:38:35,729
నేను చనిపోతున్నాను, పిచ్చివాడా.
414
00:38:37,232 --> 00:38:38,862
నేను చాలా సంతోషంగా ఉన్నాగానీ...
415
00:38:40,277 --> 00:38:41,737
నా కొడుకులను చూసి.
416
00:38:44,656 --> 00:38:46,946
నాకు నా ఉద్యోగం ద్వారా పరిచయాలు ఉన్నాయి.
417
00:38:47,034 --> 00:38:50,044
నిన్ను అమెరికాకు తీసుకెళతాను,
నిపుణులకు చూపేందుకు...
418
00:38:50,037 --> 00:38:53,367
జోసెఫ్ బంగారం,
నేను నీకు ఎప్పుడూ ఏం చేప్పాను?
419
00:38:54,541 --> 00:38:55,921
నాకు అది వినాలని ఉంది.
420
00:39:00,964 --> 00:39:03,684
నేను ప్రపంచ సమస్యలన్నీ తీర్చక్కరలేదు.
421
00:39:04,843 --> 00:39:06,803
కొన్ని పరిష్కరిస్తే సరిపోతుంది.
422
00:39:07,804 --> 00:39:08,934
ఇంకా రీచర్.
423
00:39:10,223 --> 00:39:15,523
నీకు ముగ్గురు మనుషులకున్నంత బలం ఉంది.
ఆ బలంతో ఏం చేస్తావు?
424
00:39:17,064 --> 00:39:19,484
నేను సరైనది చేస్తాను, అమ్మా.
425
00:39:20,984 --> 00:39:22,324
నువ్వు చేస్తావు.
426
00:39:22,319 --> 00:39:23,949
ఎప్పుడూ చేస్తావు.
427
00:39:24,571 --> 00:39:27,411
సరైనది ఆందంగా లేకపోయినా సరే.
428
00:39:29,701 --> 00:39:33,121
నువ్వు ఓకినావాలో
చిన్నన్నప్పటి నుండి, కదా?
429
00:39:35,957 --> 00:39:37,077
నీకు తెలుసు.
430
00:39:38,960 --> 00:39:41,460
ఓకినావాలో నేను కర్టిస్ బిషప్‌ను కొట్టానని.
431
00:39:42,923 --> 00:39:45,053
అది జో అని ఎప్పుడూ నమ్మలేదు.
432
00:39:45,050 --> 00:39:47,390
అమ్మా, నీకు నిజం చెప్పాలని అనుకున్నాడు.
433
00:39:48,637 --> 00:39:49,847
నేను చెప్పనీయలేదు.
434
00:39:49,930 --> 00:39:52,060
నువ్వు తనను కాపాడావు.
435
00:39:52,057 --> 00:39:53,637
అదే నువ్వు.
436
00:39:55,727 --> 00:39:58,477
ఒక ప్రత్యేకమైన అబ్బాయిని
బాధనుండి కాపాడావు.
437
00:39:59,689 --> 00:40:02,649
మీ నాన్నకు, నాకు ఎప్పుడూ
438
00:40:02,651 --> 00:40:05,821
మీ ఇద్దరినీ మీ స్వభావాలకు
అనుగుణంగా ఉండేందుకు అడ్డుకోలేదు.
439
00:40:07,989 --> 00:40:10,529
మీ స్వభావాలు స్వచ్ఛమైనవి,
440
00:40:12,744 --> 00:40:14,204
మీ హృదయాల్లా.
441
00:40:16,498 --> 00:40:19,038
నేను ఒక ఫోన్ మాట్లాడాలి.
ఇప్పుడే వస్తాను.
442
00:40:43,525 --> 00:40:45,435
మీ తాతయ్య యుద్ధ పతకం.
443
00:40:50,240 --> 00:40:53,450
ప్రమాదంలో ధైర్యాన్ని చూపినందుకు.
444
00:40:56,538 --> 00:40:58,958
సరైనది చేయడానికి ధైర్యం కావాలి.
445
00:41:22,022 --> 00:41:23,822
ఇప్పుడు నువ్వు ఏడవవచ్చు, రీచర్.
446
00:41:38,663 --> 00:41:41,373
అయితే సైనికులు,
ఎఫ్‌బీఐ ఏజెంట్లే వస్తుంటారు.
447
00:41:43,501 --> 00:41:48,261
వాళ్ళు నువ్వు ఇక్కడే కొన్ని రోజులు ఉండి,
వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి.
448
00:41:49,216 --> 00:41:51,376
ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ఇష్టం లేదు.
449
00:41:52,636 --> 00:41:54,506
నీకు ఉండడం కూడా ఇష్టంలేదు.
450
00:41:59,935 --> 00:42:01,555
వందల వేల ఏళ్ళ క్రితం,
451
00:42:01,645 --> 00:42:05,225
చలిమంటలు వేసుకుని ఉండిపోయిన వారు,
సంచరించే వ్యక్తులు ఉండేవారు.
452
00:42:06,983 --> 00:42:10,363
నాకు ఖచ్చితంగా తెలుసు,
నేను నేరుగా సంచరించే వారినుండి వచ్చాను.
453
00:42:12,614 --> 00:42:14,164
అదే నేను.
454
00:42:16,826 --> 00:42:20,326
కానీ ఎవరైనా నన్ను జ్వాలకు
దగ్గరగా ఉండనిస్తే, అది నువ్వే.
455
00:42:30,799 --> 00:42:31,799
అంటే...
456
00:42:34,636 --> 00:42:37,756
ఇక్కడ నుండి
ఎక్కడికైనా తిరగడానికి వెళితే,
457
00:42:39,808 --> 00:42:40,888
నాకు ఫోన్ చెయ్.
458
00:42:49,985 --> 00:42:50,985
చేస్తాను.
459
00:42:55,573 --> 00:42:57,083
నువ్వు ఏం చేస్తావు?
460
00:43:01,454 --> 00:43:04,044
నా కుటుంబం నిర్మించిన పట్టణాన్ని
తిరిగి కడతాను.
461
00:43:05,250 --> 00:43:06,750
నువ్వు మేయర్ కావాలి.
462
00:43:08,420 --> 00:43:09,840
అవకాశాలు ఉన్నాయని విన్నాను.
463
00:43:19,723 --> 00:43:21,733
అది అంత చెడ్డ ఆలోచనేం కాదు.
464
00:44:05,268 --> 00:44:06,558
హే, బాబు.
465
00:44:06,561 --> 00:44:08,901
ఫిన్లీ నీకు తన కారు చూడమన్నాడా?
466
00:44:10,023 --> 00:44:11,943
నీకు పిచ్చి సంగీతం వినిపిస్తున్నాడా?
467
00:44:16,488 --> 00:44:18,108
నేను నీకు బట్ట గొలుసు తెచ్చాను.
468
00:44:37,133 --> 00:44:39,393
- తప్పుకోండి.
- క్షమించండి.
469
00:44:58,446 --> 00:45:00,736
నువ్వు వెళ్ళే ముందు ఇక్కడ ఆగుతావని తెలుసు.
470
00:45:00,824 --> 00:45:03,794
- ఊహించగలిగేలా అవుతున్నాను
- అనుకున్న దానికంటే తరువాత వచ్చావు.
471
00:45:05,161 --> 00:45:07,711
రాస్కో నుండి
దూరంగా వెళ్ళడం అంత సులువు కాదు.
472
00:45:11,501 --> 00:45:12,421
ధన్యవాదాలు.
473
00:45:14,129 --> 00:45:17,589
పికార్డ్ ప్రమేయం కారణంగా
ఫెడ్స్ భయపడిపోతున్నారు.
474
00:45:17,674 --> 00:45:19,184
వాళ్ళు నిన్ను విచారిస్తారు.
475
00:45:19,259 --> 00:45:22,099
- వాళ్ళకు ఏం చెప్పావు?
- ఏనాటికీ దొరకవని చెప్పాను.
476
00:45:22,095 --> 00:45:25,845
వాళ్ళు పట్టణంలో గోదాము పక్కన
ఉన్నారు, సులభంగా కనబడతావు కాబట్టి...
477
00:45:25,849 --> 00:45:29,599
- మనది ఇక్కడ పూర్తి అవ్వగానే వెళతాను.
- మంచిది. తెలివైన వాడివి.
478
00:45:32,939 --> 00:45:37,939
విను, నాకు వీడ్కోలు చెప్పడం, అవన్నీ రావు,
ఖచ్చితంగా నీకూ రాదు, కానీ...
479
00:45:40,029 --> 00:45:41,529
నువ్వు ఇక్కడకు రాకపోయి ఉంటే
480
00:45:41,531 --> 00:45:44,531
ఇది ఎప్పటికీ కనుగొనలేకపోయే వాడిని,
లేదా చనిపోయేవాడిని.
481
00:45:44,534 --> 00:45:47,914
- చివరికి నువ్వే కనుగొనేవాడివి.
- అభినందిస్తున్నాను.
482
00:45:47,996 --> 00:45:49,956
ఆ తరువాత చనిపోయేవాడివి.
483
00:45:52,792 --> 00:45:56,752
నువ్వు ఒక మృగం అయిఉండవచ్చు,
కానీ అంతరంగాలలో బాగుంటావు.
484
00:45:56,838 --> 00:46:00,178
నువ్వు చాలా ఇబ్బంది పెడతావు,
కానీ నువ్వు బాగున్నావు కూడా.
485
00:46:01,468 --> 00:46:02,718
ఇంకా ఒక మంచి పోలీసువు.
486
00:46:03,970 --> 00:46:05,560
సరే, ఎక్కువ కాలం కాదు.
487
00:46:05,555 --> 00:46:07,595
నా పోలీసు పని చాలు.
488
00:46:08,141 --> 00:46:09,021
బోస్టన్?
489
00:46:09,934 --> 00:46:13,194
ఇక్కడ కొన్ని వారాలు ఉండి,
రాస్కోకు పరిస్థితులు చక్కదిద్ది,
490
00:46:13,188 --> 00:46:14,648
అప్పుడు ఇంటికి వెళతాను.
491
00:46:14,731 --> 00:46:16,151
ఇంక తిరగడం ఆపాల్సిన సమయం.
492
00:46:16,149 --> 00:46:17,899
పారిపోవడం ఆపాలి, తెలుసా?
493
00:46:18,860 --> 00:46:20,990
షారన్ నాకు ఒక జీవితం కోరుకుంటుంది.
494
00:46:22,405 --> 00:46:24,065
అది ఒంటరిగా జీవించకూడదా?
495
00:46:25,116 --> 00:46:26,366
అవును...
496
00:46:27,243 --> 00:46:30,163
నేను ఒకరిని చూసుకోడానికి సిద్ధంగా ఉన్నాను.
497
00:46:30,163 --> 00:46:32,543
అంతేకాకుండా, జాక్‌ను
ఆశ్రయంలో వదిలేయలేను.
498
00:46:33,875 --> 00:46:34,705
జాక్?
499
00:46:34,709 --> 00:46:38,339
హా, అతనికి ఒక పేరు కావాలి,
నువ్వది ఉపయోగించడం లేదు, అందుకని జాక్.
500
00:46:41,132 --> 00:46:44,392
నేను ఒక్కడినే
కొత్త పనులు చేయాల్సిన పనిలేదు.
501
00:46:44,469 --> 00:46:47,849
రాస్కో ఇంకా నాలాంటి వాళ్ళు
బయట చాలా మంది ఉన్నారు.
502
00:46:48,890 --> 00:46:50,890
వాళ్ళకు నీ దగ్గరకు అనుమతించాలి.
503
00:46:53,186 --> 00:46:54,226
గుర్తుంచుకుంటాను.
504
00:46:54,229 --> 00:46:58,109
సరే, అంటే, చీఫ్ డిటెక్టివ్‌గా అధికారిక
పనులలో చేయాల్సిన చివరి పని--
505
00:46:58,191 --> 00:46:59,111
నిన్ను తొలగించారు.
506
00:46:59,192 --> 00:47:01,032
చనిపోయినవాళ్ళది చెల్లదు.
507
00:47:01,027 --> 00:47:04,407
చీఫ్ డిటెక్టివ్‌గా అధికారిక
పనులలో చేయాల్సిన చివరి పని,
508
00:47:04,489 --> 00:47:07,989
ఇక్కడ ఒక పదిరోజుల క్రితం
509
00:47:08,076 --> 00:47:09,736
జరిగిన తప్పును సరిదిద్దాలి.
510
00:47:10,995 --> 00:47:12,205
పీచ్ ముక్క.
511
00:47:12,205 --> 00:47:13,535
జార్జియాలో ఉత్తమమైనది.
512
00:47:14,165 --> 00:47:15,115
ధన్యవాదాలు.
513
00:47:16,668 --> 00:47:18,248
నువ్వు అది తింటావా?
514
00:47:18,253 --> 00:47:21,303
నాకు షుగర్ ఇంకా కొలెస్ట్రాల్ ఉంది, తెలుసా?
515
00:47:21,381 --> 00:47:23,171
నోరు మూసుకొని నీ పై తిను.
516
00:47:32,642 --> 00:47:34,142
అయితే? వేచి ఉండడం విలువైనదా?
517
00:47:36,854 --> 00:47:37,904
నావద్ద మంచిది ఉంది.
518
00:48:27,530 --> 00:48:30,780
ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి
ధైర్యం కావాలి, జో.
519
00:51:15,364 --> 00:51:17,374
సబ్‌టైటిల్ అనువాద కర్త సమత
520
00:51:17,450 --> 00:51:19,450
క్రియేటివ్ సూపర్‌వైజర్
నల్లవల్లి రవిందర్